
హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కొడాలి నానిని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్ నుండి ముంబైలోని ఆసుపత్రికి తరలించారు.
నాని కుటుంబ సభ్యులు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని ప్రఖ్యాత ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందనుంది. కొన్ని రోజుల క్రితం, నాని తీవ్రమైన ఛాతీ నొప్పితో గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చేరారు.