
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) భుజంగరావు, మాజీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రాధాకిషన్ రావులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని, పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని కోర్టు వారిని ఆదేశించింది. అంతేకాకుండా ఈ కేసులో విచారణ ప్రక్రియకు సహకరించాలని కోర్టు వారికి సూచించింది.