నాగర్‌కర్నూల్‌: మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు

Photo of author

By venkatapavanisanivada99@gmail.com

నాగర్‌కర్నూల్‌ : మైనింగ్‌ను నిరసిస్తూ బల్మూరు మండలం మైలారం గ్రామంలో సోమవారం నిర్వాసితులు నిరసన చేపట్టారు. మైనింగ్ వద్దు, గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు నిరవధిక సమ్మెకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు రైతులను, స్థానికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు.

మరోవైపు పోలీసులు వెల్దండ వద్ద మానవ హక్కుల కార్యకర్తలు ప్రొఫెసర్ హరగోపాల్, గడ్డం లక్ష్మణ్‌లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైలారం రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయల్దేరారు.

Leave a comment