హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావును పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కోకాపేటలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనపై ఫిర్యాదుల మేరకు కరీంనగర్ ఫస్ట్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదుల మేరకు కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు.