విజయపుర: విజయపుర జిల్లా తాలికోట్ తాలూకా బిలేబావి క్రాస్ సమీపంలో శుక్రవారం కారు, హార్వెస్టర్ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.
విజయపురానికి 90 కిలోమీటర్ల దూరంలోని బిలేబావి క్రాస్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులను నింగప్ప పాటిల్, భీంషి సంకనల్, శశికళ జైనాపూర్, శాంతవ్వ శంకర్ పాటిల్, దిలీప్ పాటిల్‌గా గుర్తించారు.
విజయపురలోని అలియాబాద్‌కు చెందిన ఈ కుటుంబం యాదగిరి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో హార్వెస్టర్‌ను ఢీకొన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.