
హైదరాబాద్: ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.
రాష్ట్ర శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేపర్ లీకేజీలు, అవకతవకలు లేకుండా పారదర్శకంగా పరీక్షలను నిర్వహిస్తున్నామని ఉద్ఘాటించారు.
ఖాళీల భర్తీని వివరించే జాబ్ క్యాలెండర్ను దశలవారీగా అనుసరిస్తామని, దాని ప్రకారం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.